తెలంగాణ

telangana

ETV Bharat / state

సరోగసి ద్వారా దూడల ఉత్పత్తి: గిరిరాజ్ సింగ్ - Union_Minister

సరోగసి విధానం ద్వారా ఆడ దూడల ఉత్పత్తి పెంపొందించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో పశుసంవర్ధక, పాడి, మత్స్య శాఖలపై జరిపిన సమీక్షలో పాల్గొన్నారు.

గిరిరాజ్ సింగ్

By

Published : Sep 7, 2019, 1:02 PM IST

హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో పశుసంవర్ధక, పాడి, మత్స్య శాఖలపై సమీక్ష జరిగింది. సమావేశంలో కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పాల్గొన్నారు. మగ లేగ దూడలకు బదులు ఆడ దూడల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. తద్వారా పాల ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ, సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం పురోగతిపై అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం సంచార వైద్యశాల, సంచార చేపల మార్కెట్, మత్స్యకారుల మోపెడ్లను కేంద్ర మంత్రి పరిశీలించారు.

సరొగసి ద్వారా దూడల ఉత్పత్తి: గిరిరాజ్ సింగ్

ABOUT THE AUTHOR

...view details