కేంద్ర హోం మంత్రికి తప్పని లాక్డౌన్ కష్టాలు - Union Minister of State Kishan Reddy Perfoms Mothers anniversary in isolation
లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దిల్లీలో తన తల్లి సంవత్సరీకాన్ని ఒంటరిగా నిర్వహించాల్సి వచ్చింది.
కేంద్ర హోం మంత్రికి తప్పని లాక్డౌన్ కష్టాలు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కరోనా పర్యవేక్షణ బాధ్యతలతో గత నెల రోజులుగా ఢిల్లీలో ఉన్నారు. ఆయన భార్య, పిల్లలు, సోదరులు అందరూ స్వగ్రామం తిమ్మాపూర్ లో ఉన్నారు. తల్లి సంవత్సరీకం అయినప్పటికీ కేంద్ర మంత్రిగా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించలేక దిల్లీలోనే ఉండి పోయారు. దీంతో ఒంటరిగా తల్లి సంవత్సరీకం దిల్లీలో కిషన్ రెడ్డి నిర్వహించగా..ఆయన సోదరులు, బంధువులు స్వగ్రామంలో నుంచి వీడియ కాన్ఫరెన్స్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.