జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ తీసుకుని పని చేయాలని భాజపా శ్రేణులకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు. భాగ్యనగర్, రంగారెడ్డి జిల్లాల ముఖ్య కార్యకర్తలతో జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షా సమావేశానికి భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, గరికపాటి మోహన్ రావుతో కలిసి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టభద్రులతో ఓటు నమోదు చేయించాలన్నారు.
'జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ తీసుకుని పని చేయాలి' - కిషన్రెడ్డి వార్తలు
భాగ్యనగర్, రంగారెడ్డి జిల్లాల భాజపా ముఖ్య కార్యకర్తలతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, గరికపాటి మోహన్ రావు సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్షించారు. ఎన్నికలను సీరియస్ తీసుకుని పని చేయాలని సూచించారు.
!['జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ తీసుకుని పని చేయాలి' union minister kishanreddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9128874-426-9128874-1602342256096.jpg)
union minister kishanreddy