Kishanreddy fires on BRS Government : రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్లే... కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు ఆలస్యం అవుతున్నాయని... కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి.. ఎంఎంటీఎస్, ట్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణం సహా పలు అంశాల్లో... కేసీఆర్ సర్కారు ఎటువంటి సహకారం అందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ గౌరవాన్ని తీసుకెళ్లి దిల్లీలో తాకట్టు : రాజకీయాలు పక్కన పెట్టి.. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని కిషన్ రెడ్డి హితవు పలికారు. అంబర్ పేట, ఉప్పల్ వద్ద... రోడ్డు నిర్మాణాలకు సంబంధించి.. రాష్ట్ర మంత్రులు అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ చురకలు అంటించారు. మోదీ హయాంలో... తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం.. గతం కంటే రెండింతలు అయ్యాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ గౌరవాన్ని తీసుకెళ్లి దిల్లీలో మద్యం బాటిళ్లకు తాకట్టు పెట్టారని ఆయన మండిపడ్డారు. పథకాలు సాధించినట్లు ఎన్ని ఫోన్లు వాడింది చూపించారని ఎద్దేవా చేశారు.
ఆరు నెలలైన అభివృద్ధికి సహకరించాలి : బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న కుటుంబ పార్టీలకు సీఎం కేసీఆర్ డబ్బులు ఇస్తా, ఛైర్మన్గా ఉంటాననీ చెప్పినట్లు ప్రసార మాధ్యమాల్లో చుసానని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. దేశంలోనీ అన్ని పార్టీల ఎన్నికల ఖర్చు ఇస్తామని కేసీఆర్ చెబుతున్నాడంటే.. బీఆర్ఎస్ సర్కారు ఎన్ని వేల కోట్ల సంపాదించిందో అర్ధమవుతుందన్నారు. కేసీఆర్కు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉండే ఆరు నెలలైన బీఆర్ఎస్ సర్కారు అభివృద్ధికి సహకరించాలని కోరారు.