Kishanreddy Comments on AP Bifurcation Issues : విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి... రెండు రాష్ట్రాలను కూర్చోబెట్టి చర్చలు జరిపామని... నిర్ణయాలను బలవంతంగా రాష్ట్రాలపై రుద్దడం ఉండబోదన్నారు. డీలిమిటేషన్ ఇప్పటికిప్పుడే జరుగుతుందని చెప్పలేమన్న కిషన్‌రెడ్డి... రాజ్యాంగం ప్రకారమే నియోజకవర్గాల పునఃర్విభజన ఉంటుందన్నారు.
ప్రధాని మోదీకి నార్త్, సౌత్ అంటూ తేడా ఉండదు :దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేది సరికాదని కిషన్‌రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా... 2, 3తేదీల్లో రాష్ట్రంలో ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయించామని ఆయన వెల్లడించారు. డీలిమిటేషన్ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్త పార్లమెంటులో సీట్ల సామర్థ్యం గురించి చెప్తూ ప్రధాని అన్నారన్నారు. నార్త్, సౌత్ అంటూ విభేదాలు సృష్టించవద్దన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి... ప్రధాని మోదీకి నార్త్, సౌత్ అంటూ తేడా ఉండదని పేర్కొన్నారు.
TELANGANA FORMATION DAY 2023 : జూన్ 2న కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్ అనేది బీజేపీ విధానం : జాతీయ భావజాలంతో పనిచేసే పార్టీ బీజేపీ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్ అనేది తమ పార్టీ విధానమని పేర్కొన్నారు. పీవీ నర్సింహారావు, దేవెగౌడ ప్రధానులు కాలేదా అని ప్రశ్నించిన కిషన్‌రెడ్డి... ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలని కేసీఆర్ కుయుక్తులు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో నాయకులు చేరినంత మాత్రాన పార్టీ గెలవదని, ముందు ప్రజల మనసులు గెలవాలని చూస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బీజేపీ నుంచి ఎవరూ వెళ్లిపోవడం లేదన్న ఆయన... కర్ణాటకలో ఓడిపోయినంత మాత్రాన నిరాశ చెందడం లేదని పేర్కొన్నారు. బీజేపీ ఏ ఒక్కరో చేరనంత మాత్రాన పార్టీకి నష్టం జరుగదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్ అనేది బీజేపీ విధానం: కిషన్‌రెడ్డి 'ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా ఈ సంవత్సరం కూడా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటలో ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ ద్వారా ఈ వేడుకలు నిర్వహించబోతున్నాం. ఈసారి కూడా 2, 3 తేదీలలో అనగా.. 2 వ తేదీ ఉదయం 7 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ ద్వారా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభిస్తాం. 3వ తేదీ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతాం. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఒక్క తెలంగాణలోనే కాకుండా వివిధ రాష్ట్రాల రాజధానులలో ఎక్కడ అయితే తెలంగాణ ప్రజలు ఉంటున్నారో వారందరినీ గవర్నర్లు రాజ్‌భవన్‌కు ఆహ్వానించి వారి సమక్షంలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది.'-కిషన్‌రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
ఇవీ చదవండి :