తెలంగాణ

telangana

By

Published : Oct 15, 2020, 4:21 PM IST

Updated : Oct 15, 2020, 4:51 PM IST

ETV Bharat / state

వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పర్యటన

వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో జీహెచ్​ఎంసీ పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమై... ప్రజలు తీవ్రం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పర్యటన
వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పర్యటన

బేగంపేటలోని బ్రాహ్మణ వాడి ప్రకాశ్​ నగర్, నల్లగుట్ట, సీతాఫల్మండి డివిజన్లలోని వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సహయక చర్యలు చేపట్టడంలో జీహెచ్​ఎంసీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

నాలాలు పొంగి పొర్లడం, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల వరదనీరు రోడ్లను ముంచెత్తిందన్నారు. తమ ఇబ్బందులను ప్రజలు మంత్రికి విన్నవించుకున్నారు. అధికారులు స్పందించి తక్షణమే సహాయకచర్యలు ముమ్మరం చేయాలని మంత్రి ఆదేశించారు. బాధితులకు ఆహరం పంపిణీ చేయాలని సూచించారు.

ఇదీ చూడండి:సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ

Last Updated : Oct 15, 2020, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details