పోలీసులకోసమో, వైద్యుల కోసమో మాస్కులు ధరించవద్దని... అందరి ఆరోగ్యం కోసం మాస్కులు పెట్టుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు.
kishan reddy:'మాస్కులు.. పోలీసుల కోసమో, డాక్టర్స్ కోసమో కాదు'
సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం చూస్తుందని, దానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
థర్డ్‌వేవ్‌పై వదంతులు నమ్మొద్దని... ఒకవేళ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కిషన్ రెడ్డి అన్నారు. వ్యాక్సిన్ కోసం పలు దేశాలు మనకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ... మన దేశ పౌరులకు వ్యాక్సినేషన్ అయిన తర్వాత మిగతా దేశాలకు ఇస్తామని ప్రధాని మోదీ చెప్పడం సంతోషకరవిషమన్నారు. ఈ ఉదయం మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఆయన... అందరూ బాగుండాలని, కొవిడ్ మహమ్మారి తొలగిపోవాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:BANDI SANJAY: 'ఎంఐఎంతో తెరాసకు ఉన్న రహస్య ఒప్పందమేంటి?'