Kishan Reddy: కొవిడ్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని.. 60 ఏళ్ల పైబడిన వారందరూ తప్పనిసరిగా బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్లో నూతన సీసీ రోడ్డు, కమ్యూనిటీ భవనం నిర్మాణాల పనులను కిషన్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, స్థానిక కార్పొరేటర్ పావని పాల్గొన్నారు.
పండుగల సందర్భంగా ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలి. ప్రజల సహకారం లేకుండా కరోనాను అరికట్టలేము. వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకోవాలి. కొవిడ్ నివారణకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలి.