Kishan reddy on Grain collection: రాష్ట్రంలో ధాన్యం గొడవకు కారణం.. హుజూరాబాద్ ఉపఎన్నికలేనని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఉపఎన్నికల ఫలితాలు తర్వాతే ఈ సమస్య ఎందుకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం 2014లో ధాన్యం, బియ్యం సేకరణకు రూ.3,400 కోట్ల ఖర్చు చేస్తే.. గతేడాది రూ.26,600 కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పారు. ప్రస్తుతం బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ లేదన్నారు. నాలుగైదు ఏళ్లుగా బాయిల్డ్ రైస్ వినియోగం తగ్గిందని చెప్పారు. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం చివరి బియ్యపు గింజా కొంటామని స్పష్టం చేశారు. సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తమకు కార్యాచరణ ఇవ్వడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం విదేశాలకు బియ్యం ఎగుమతి చేయలేదని.. అందుకే ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వారూ మందుకురావడం లేదన్నారు.