శ్రీశైలం ఎడమ గట్టున ఉన్న భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. భూగర్భంలో చిక్కుకుపోయిన 9మంది సిబ్బంది వివరాలు తెలవకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తి సహాయ, సహకారాలు అందించాలని ఎన్డీఆర్ఎఫ్ను ఆదేశించారు.
అగ్నిప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విచారం
భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో మాట్లాడిన ఆయన.. వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు.
అగ్నిప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విచారం
ప్రమాద ఘటనను అమిత్ షాకు తెలియజేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందించాలని కేంద్ర హోంమంత్రి ఆదేశించారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ సిబ్బంది క్షేమంగా బయటకు రావాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి 'నాన్నా జాగ్రత్త.. ముద్దివ్వొద్దు, ముట్టుకోవద్దు!'