మహాత్మా గాంధీ స్ఫూర్తి, ఆలోచనా విధానాలతో మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉప్పు సత్యాగ్రహం, ఖాదీ దుస్తుల తయారీ కోసం గాంధీజీ చేపట్టిన స్వదేశీ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గాంధీ స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం ముందుకెళ్తోంది: కిషన్‌రెడ్డి - gandhi jayanthi 2020
మహాత్మాగాంధీ చేపట్టిన స్వదేశీ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్‌లో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని.. నివాళులు అర్పించారు.
గాంధీ స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం ముందుకెళ్తోంది: కిషన్‌రెడ్డి
ఆత్మ నిర్భర్ భారత్ కోసం ప్రధాని మోదీ ఎన్నో పథకాలు చేపడుతున్నాడని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మాణం చేసుకోవాలని సూచించారు.
ఇదీచూడండి: కరోనాను ఎదుర్కోవడమే మహాత్మునికి ఇచ్చే నిజమైన నివాళి: కిషన్ రెడ్డి