తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ ఆదాయంలో 10 శాతమైనా నగర అభివృద్ధికి ఖర్చు పెట్టాలి' - సికింద్రాబాద్​ నియోజక వర్గంలో కిషన్​ రెడ్డి

Kishan Reddy Padayatra in Secunderabad: హైదరాబాద్‌కు వచ్చే ఆదాయంలో 10 శాతమైనా నగర అభివృద్ధికి ఖర్చు పెట్టాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని కాలనీల్లో పర్యటించిన ఆయన.. నియోజకవర్గ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అడ్డగుట్ట డివిజన్‌లోని పలు బస్తీల్లో అధికారులతో కలిసి తిరుగుతూ.. ప్రజా సమస్యలపై ఆరా తీశారు.

Kishan Reddy
Kishan Reddy

By

Published : Nov 27, 2022, 2:01 PM IST

'హైదరాబాద్‌కు వచ్చే ఆదాయంలో 10 శాతమైన నగర అభివృద్ధికి ఖర్చు పెట్టాలి'

Kishan Reddy Padayatra in Secunderabad: హైదరాబాద్‌కు వచ్చే ఆదాయంలో 10 శాతమైనా నగర అభివృద్ధికి ఖర్చు పెట్టాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని కాలనీల్లో పర్యటించిన ఆయన.. నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అడ్డగుట్ట డివిజన్‌లోని పలు బస్తీల్లో అధికారులతో కలిసి తిరుగుతూ.. ప్రజా సమస్యలపై ఆరా తీశారు. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. రెండు పడక గదులు ఇంకా రాలేదని కేంద్రమంత్రి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. సమస్యలు తెలుసుకున్న కిషన్‌రెడ్డి.. ప్రభుత్వానికి తెలియజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details