చెడు మీద మంచి విజయం సాధించడమే విజయదశమి పండుగ ఉద్దేశమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. భర్కత్పురాలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌతమ్రావులతో కలిసి కిషన్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, పాలపిట్టను చూశారు.
ప్రపంచంలో ఉన్న హిందువులందరూ పెద్దఎత్తున విజయదశమి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారని కిషన్రెడ్డి తెలిపారు. హిందూ, భారతదేశ మూలాలున్న హిందూయేతర ఇండోనేషియా, మంగోలియా లాంటి దేశాల్లో పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారని కిషన్రెడ్డి తెలిపారు.