భాజపా నేత, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తండ్రి ప్రొ.ఎన్‌వీఆర్‌ఎల్‌ఎన్ రావు మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ రావు మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రొ.రావు మరణం విద్యారంగానికి తీరనిలోటు: కిషన్ రెడ్డి - భాజపా నేత రామచంద్రరావు తండ్రి మృతి
ప్రొఫెసర్ ఎన్‌వీఆర్‌ఎల్‌ఎన్ రావు మరణం తనను ఎంతగానో బాధించిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

ఎన్‌వీఆర్‌ఎల్ ఎన్ రావు మృతి పట్ల సంతాపం తెలిపిన కిషన్‌రెడ్డి
ప్రొఫెసర్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని కిషన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎన్‌వీఆర్‌ఎల్‌ఎన్ రావు మరణం విద్యారంగానికి తీరనిలోటని అన్నారు.
ఇదీ చదవండి:CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ