సీరం, భారత్ బయోటెక్ టీకాల కోసం ప్రపంచం వేచిచూస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు కరోనా టీకాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ల్యాబ్ క్యూబ్ సంస్థ తయారు చేసిన ఇమ్యూనో బూస్టర్ ఉత్పత్తులను ఆయన ఆవిష్కరించారు. ఫైజర్, స్పుత్నిక్ వ్యాక్సిన్ కంటే భారత టీకాలపైనే ప్రపంచానికి ఆసక్తిగా ఉందని పేర్కొన్నారు. ట్రయల్స్‌లో ఉన్న భారతదేశ టీకాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.
కొవిడ్ టీకాకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు:కిషన్ రెడ్డి
ఇప్పటివరకు కరోనా టీకాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని ల్యాబ్‌క్యూబ్‌లో ఇమ్యూనో బూస్టర్ ఉత్పత్తిని కిషన్ రెడ్డి ప్రారంభించారు.
కొవిడ్ టీకాకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు:కిషన్ రెడ్డి
సరైన టీకా ఎంపిక విషయంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటైందని వెల్లడించారు. కొవిడ్ నియంత్రణలో ప్రధాని మోదీ సకాలంలో స్పందించి తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలిచ్చాయని కిషన్ రెడ్డి తెలిపారు. టీకా వచ్చేంత వరకు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుర్వేద మందులు ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నాయని... యువత ముందుకొచ్చి మరిన్ని ఆవిష్కరణలు చేయాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి:'వాజ్‌పేయీ ఆలోచనలను అర్థం చేసుకోవడం కష్టం'