తెలంగాణలో అవినీతి, కుటుంబపాలన లేని వ్యవస్థ వచ్చినప్పుడే ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు వస్తాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన పతంగోత్సవాన్ని భాజపా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్ సహా స్థానిక నాయకులతో కలిసి కిషన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
'కుటుంబపాలన లేని వ్యవస్థతోనే ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు' - Kite Festival begins in Necklace Road
హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో భాజపా రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో పతంగోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. జోడి నెం.1గా మోదీ, అమిత్‌షాను పేర్కొంటూ ముద్రించిన పతంగులను నింగిలోకి ఎగరవేసిన కిషన్ రెడ్డి... ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
!['కుటుంబపాలన లేని వ్యవస్థతోనే ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు' పతంగోత్సవాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10237275-891-10237275-1610608029022.jpg)
పతంగోత్సవాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
జోడి నెం.1గా మోదీ, అమిత్‌షాను పేర్కొంటూ ముద్రించిన పతంగులను నింగిలోకి ఎగరవేసిన కిషన్ రెడ్డి... ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అన్ని రంగాల్లో సానుకూలమైన మార్పు తీసుకురావాలని ఆకాంక్షించిన కిషన్ రెడ్డి... కరోనా వ్యాక్సిన్ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి మళ్లీ గాడినపడుతుందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
పతంగోత్సవాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ఇదీ చదవండి :కాఫీలు తాగారా.. టిఫినీలు చేశారా..!
Last Updated : Jan 14, 2021, 3:49 PM IST