తెలంగాణ

telangana

ETV Bharat / state

భవిష్యత్తులో హైస్కూల్‌ స్థాయిలోనే ఒకేషనల్ కోర్సులు: కిషన్​రెడ్డి - minister talasani srinivas yadav latest

హైదరాబాద్​లోని మల్లేపల్లి ఐటీఐ కళాశాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఇది రాష్ట్రంలోనే ప్రత్యేకమైందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి పాల్గొన్నారు.

union-minister-kishan-reddy-inaugurated-mallepally-iti-college-in-hyderabad
భవిష్యత్తులో హైస్కూల్‌ స్థాయిలోనే ఒకేషనల్ కోర్సులు: కిషన్​రెడ్డి

By

Published : Oct 3, 2020, 2:16 PM IST

Updated : Oct 3, 2020, 3:21 PM IST

హైదరాబాద్ మల్లేపల్లి ఐటీఐ కళాశాల రాష్ట్రంలోనే ప్రత్యేకమైందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మోడల్ ఐటీఐల కోసం కేంద్రం రూ.300 కోట్లు కేటాయించిందని తెలిపారు. ప్రతి రాష్ట్రంలో ఒక మోడల్ ఐటీఐ కళాశాల నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ మల్లేపల్లిలో ప్రభుత్వ మోడల్ ఐటీఐ భవనాన్ని ప్రారంభించారు.

భవిష్యత్తులో హైస్కూల్‌ స్థాయిలోనే ఒకేషనల్ కోర్సులు ఉంటాయని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ఐటీఐలకు కేంద్రం మరో రూ.70 కోట్లు ఇచ్చిందని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి:అటల్​ సొరంగాన్ని ప్రారంభించిన మోదీ

Last Updated : Oct 3, 2020, 3:21 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details