కరోనా మహమ్మారి ప్రపంచానికి ఎన్నో కొత్త పాఠాలు నేర్పిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి (Union minister Kishan reddy) అన్నారు. సవాళ్లను అధిగమించి వైరస్ నియంత్రణ పరికరాల తయారీలో దేశం స్వయంసమృద్ధి సాధించిందని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కు తప్పనిసరైందని పునరుద్ఘాటించారు. మేక్ ఇండియాలో భాగంగా జైత్ర సంస్థ తయారు చేసిన బైపోలార్ గాలి క్రిమిసంహారిణి, ప్యూరిఫయర్ పరికరాన్ని కేంద్రమంత్రి(Union minister Kishan reddy) హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
Kishan reddy: 'కరోనా నియంత్రణ పరికరాల తయారీతో.. స్వయంసమృద్ధి దిశగా భారత్' - బై పోలార్ పరికరాన్ని ఆవిష్కరించిన కిషన్ రెడ్డి
కరోనా పెట్టిన సవాళ్లను అధిగమించి దేశం స్వయం సమృద్ధి సాధించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union minister Kishan reddy) హర్షం వ్యక్తం చేశారు. మేక్ ఇండియాలో భాగంగా జైత్ర సంస్థ తయారు చేసిన ఓ బై పోలార్ పరికరాన్ని కిషన్ రెడ్డి.. హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో ఆరోగ్య, వైద్య ఉత్పత్తులను తయారు చేసేందుకు కేంద్రం ప్రోత్సాహం అందిస్తోందని కిషన్ రెడ్డి(Union minister Kishan reddy) చెప్పారు. పీపీఈ కిట్లు, ఆక్సిజన్ ప్లాంట్లు, మాస్కులు, వ్యాక్సిన్లు, వెంటిలేటర్లు.. స్వదేశంలోనే తయారు చేసేలా ప్రధాని ప్రోత్సహించారు. వంద కోట్ల పైగా జనాభా ఉన్న మన దేశానికి కావాల్సిన ఉత్పత్తులను మనమే తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో స్వదేశీ సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి:HUZURABAD BYPOLL: కేసీఆర్, ఈటల మధ్య విభేదాలపై రేవంత్ కీలక వ్యాఖ్యలు