హైదరాబాద్‌లో ఎన్నికల హామీలు విస్మరించిన తెరాసకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వరదసాయాన్ని ఆ పార్టీ కార్యకర్తలే పంచుకున్నారని ఆరోపించారు. గోల్నాక డివిజన్ భాజపా అభ్యర్థి కత్తుల సరిత తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు.
గత ఎన్నికల ముందు గోల్నాకలో ఇళ్ల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఐదేళ్లు పూర్తయినా ఒక్క ఇటుక కూడా వేయలేదు. ప్రజలు నిలదీస్తారనే భయంతో శిలాఫలకాన్ని తీసేశారు. ఇళ్లు ఎందుకు ఇవ్వలేదో ప్రచారానికి వచ్చే తెరాస నేతలను ప్రశ్నించాలి. గత ఎన్నికల్లో భాజపా నాలుగు స్థానాలే గెలిచింది. ఈ ఎన్నికల్లో భాజపాపై నగర ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. ఈసారి మేయర్ పీఠం భాజపానే కైవసం చేసుకుంటుంది.