తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం ఏలుతోందని.. ఓవైసీ కుటుంబం పెత్తనం చెలాయిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం చేయకుండా తెరాస ప్రభుత్వం మాటలకే పరిమితమైందని ఆరోపించారు. అంబర్పేట-బర్కత్పురా భాజపా జిల్లా అధ్యక్షుడిగా గౌతంరావు పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం ఏలుతోంది: కిషన్రెడ్డి - union minister kishan reddy fires on trs government
రాష్ట్రంలో మరో పార్టీ ఉండకూడదన్నట్లు తెరాస వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం చేయకుండా తెరాస ప్రభుత్వం మాటలకే పరిమితమైందని ఆరోపించారు.
తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం ఏలుతోంది: కిషన్రెడ్డి
హైదరాబాద్లో ఇకపై మజ్లిస్ పెత్తనం కొనసాగనిచ్చేది లేదని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరో పార్టీ ఉండకూడదన్నట్లుగా తెరాస వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ, దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: గవర్నర్ తమిళి సై సౌందర రాజన్కు కాంగ్రెస్ నేతల లేఖ