తెలంగాణ

telangana

ETV Bharat / state

వాట్సప్‌లో మెసేజ్‌లు వస్తే పోలీసు విచారణకు పిలవటం దుర్మార్గం: కిషన్‌రెడ్డి

Kishan Reddy Fires on CM KCR: బండి సంజయ్​ని అరెస్ట్ చేసినా.. ఈటలకు నోటీసులు ఇచ్చినా బీజేపీ భయపడదని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి స్పష్టం చేశారు. బండి సంజయ్ మీద పెట్టిన కేసులు బేషరతుగా వెంటనే విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పదో తరగతి పేపర్​ లీక్ పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ధ్వజమెత్తారు.

Kishan Reddy Fires on CM KCR
Kishan Reddy Fires on CM KCR

By

Published : Apr 6, 2023, 10:37 PM IST

వాట్సప్‌లో మెసేజ్‌లు వస్తే పోలీసు విచారణకు పిలవటం దుర్మార్గం: కిషన్‌రెడ్డి

Kishan Reddy Fires on CM KCR: పోలీసులను పావులుగా వాడుకోవడం సీఎం కేసీఆర్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థను ఇంతగా దుర్వినియోగం చేసిన రాష్ట్రం మరొకటి లేదన్నారు. పదో తరగతి పేపర్​ లీకేజీ పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. బండి సంజయ్ మీద పెట్టిన కేసులు బేషరతుగా వెంటనే విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వాట్సప్‌లో మెసేజ్‌లు వస్తే పోలీసు విచారణకు పిలవటం దుర్మార్గపు చర్య అని కిషన్​రెడ్డి మండిపడ్డారు. వాట్సప్‌ మెసేజ్‌ వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోలీసులు నోటీసులు పంపడం దారుణమన్నారు. ప్రతిపక్ష నేతలు అంటే సీఎం కుటుంబానికి బానిసలు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. జర్నలిస్టు ప్రశాంత్​ ఎంతో మందికి ఆ మెసేజ్​ను ఫార్వర్డ్​ చేశారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ ఎప్పుడైనా బీఆర్ఎస్ నాయకుల పట్ల అనుచితంగా మాట్లాడారా అని అన్నారు. ప్రధానిని విమర్శించే నైతిక హక్కు బీఆర్​ఎస్ నేతలకు లేదని స్పష్టం చేశారు. జర్నలిస్టుల హక్కులను కూడా ప్రభుత్వం కాలరాస్తోందని కిషన్​రెడ్డి మండిపడ్డారు.

పదో తరగతి పేపర్ లీక్​ కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయనను శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్ డీసీపీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ పీఏలు రాజు, నరేంద్రలకు ఈ నోటీసులను అందించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే పోలీసుల నోటీసులపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. విచారణకు రావాలని పోలీసుల నుంచి నోటీసులు అందాయన్నారు. తమ న్యాయవాతులతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.

పోలీసులను పావులుగా వాడుకోవడం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య. వాట్సప్‌లో మెసేజ్‌లు వస్తే పోలీసు విచారణకు పిలవటం దుర్మార్గపు చర్య. ప్రతిపక్ష నేతలు అంటే బానిసలు అనుకుంటున్నారా. జర్నలిస్టు ప్రశాంత్‌ ఎంతో మందికి ఆ మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేశారు. జర్నలిస్టులు తమకు వచ్చిన సమాచారాన్ని వేగంగా సమాజానికి తెలిపేందుకు ప్రయత్నిస్తారు. ప్రధాని మోదీ ఎప్పుడైనా భారాస నాయకుల పట్ల అనుచితంగా మాట్లాడారా. ప్రధాని మోదీని విమర్శించే నైతికహక్కు భారాస నేతలకు లేదు. జర్నలిస్టుల హక్కులను కూడా ప్రభుత్వం కాలరాస్తోంది. -కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details