తెలంగాణ

telangana

By

Published : Aug 28, 2021, 1:30 PM IST

ETV Bharat / state

Kishan Reddy: 'కల్వకుంట్ల కుటుంబం ఒక్కటే బంగారు మయమైంది'

బంగారు తెలంగాణగా మారుస్తామన్న సీఎం కేసీఆర్(cm kcr)... అప్పుల రాష్ట్రంగా మార్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(kishan reddy) ఆరోపించారు. కేవలం కల్వకుంట్ల కుటుంబమే బంగారు కుటుంబంగా మారిందని అన్నారు. రాష్ట్రాన్ని రెండు కుటుంబాలు శాసిస్తున్నాయని ఆక్షేపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, నీతివంతమైన పాలన రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Kishan Reddy, bjp praja sangrama yatra
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, భాజపా ప్రజా సంగ్రామ యాత్ర

రాష్ట్రంలో ప్రజాస్వామ్య, నీతివంతమైన పాలన రావాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(kishan reddy) అభిప్రాయపడ్డారు. త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతోందని అన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా కుటుంబ పాలన తీసుకొచ్చారని విమర్శించారు. బంగారు తెలంగాణ కాదు... అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు. కల్వకుంట్ల కుటుంబమే బంగారు కుటుంబంగా మారిందని ఆక్షేపించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాబోతుందని అన్నారు. వేల కోట్ల రూపాయల ప్రజా సంపద దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం రెండు కుటుంబాలే రాష్ట్రాన్ని శాసిస్తున్నాయని భాజపా(bjp) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) చేపట్టిన ప్రజాసంగ్రామయాత్ర సందర్భంగా కేంద్రమంత్రి విమర్శించారు.

బీసీలకు అన్యాయం

అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్(cm kcr)... ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతారో లేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. పాతబస్తీకి మెట్రో రాకుండా ఎంఐఎం అడ్డుకుంటోందన్న కిషన్‌రెడ్డి... మెట్రో సేవలు రాకుండా పాతబస్తీకి కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తెరాస ప్రభుత్వం బీసీలకు(bc) వెన్నుపోటు పొడుస్తోందని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన ఎందుకు రిజర్వేషన్లు(reservations) కల్పించట్లేదని ప్రశ్నించారు. నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వం వచ్చాక ఒక్క టీచరు పోస్టు కూడా భర్తీ చేయలేదని పేర్కొన్నారు.

కల్వకుంట్ల కుటుంబం నోరు తెరిస్తే అబద్ధాలే. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను(etela rajender) ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారు. అక్కడ పోలీసులతో పాలన చేస్తున్నారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్‌లో ఎగిరేది కాషాయం జెండానే. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో అద్భుతమైన పాలన సాగుతోంది. ఎక్కడా రూపాయి అవినీతి లేకుండా మోదీ(pm modi) పాలన సాగిస్తున్నారు. ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా మోదీ పాలన చేస్తున్నారు. ఏడేళ్ల నుంచి రాష్ట్రంలో కూడా తెరాస(trs) పాలన సాగిస్తోంది. సీఎం కేసీఆర్ ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నారా?. సచివాలయం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణే. అవినీతి పాలన పోవాలి... నీతివంతమైన పాలన రావాలి. రెండు కుటుంబాల పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజా సంగ్రామ యాత్ర(praja sangrama yatra) చేపట్టాం.

-కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి

ఇదీ చదవండి:REVANTH REDDY: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details