తెలంగాణ

telangana

ETV Bharat / state

'అదంతా బీఆర్‌ఎస్ డ్రామా.. 8ఏళ్లలో బీజేపీకి ఒక్క అవినీతి మార్క్ లేదు' - Singareni Coal Mines Auction

kishan reddy on Singareni Coal Mines Auction: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బొగ్గు గనుల వేలంపై మాట్లాడిన కిషన్‌రెడ్డి... ఎవరైనా వేలంలోనే వాటిని కొనుగోలు చేయాలని కేంద్రం చెప్తోందని స్పష్టం చేశారు. 8 ఏళ్లుగా ఒక్క అవినీతి మరక లేకుండా కేంద్రం పాలన సాగిస్తోందని తెలిపారు.

Kishan Reddy criticized KCR
Kishan Reddy criticized KCR

By

Published : Dec 10, 2022, 5:21 PM IST

Updated : Dec 10, 2022, 7:26 PM IST

'అదంతా బీఆర్‌ఎస్ డ్రామా.. 8ఏళ్లలో బీజేపీకి ఒక్క అవినీతి మార్క్ లేదు'

Kishan Reddy fires on KCR: పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి పెంచే చర్యలను కేంద్రం చేపట్టిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎవరైనా బొగ్గు గనులను వేలంలోనే కొనుగోలు చేయాలని కేంద్రం చెప్తోందని అన్నారు. దేశంలో కొరత ఏర్పడి విదేశాల నుంచి బొగ్గు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందని వెల్లడించారు. యూపీఏ హయాంలో రూ.1.86 లక్షల కోట్ల కుంభకోణం జరిగినట్లు కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. బొగ్గు గనుల వేలంలో పారదర్శకత ఉండేలా మోదీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. 8 ఏళ్లుగా ఒక్క అవినీతి మరక లేకుండా కేంద్రం పాలన సాగిస్తోందని అభిప్రాయపడ్డారు. యూపీఏ ప్రభుత్వం కేటాయించిన అన్ని బొగ్గు గనులను సుప్రీంకోర్టు కొట్టివేసిందని వ్యాఖ్యానించారు.

'' ప్రైవేటు, ప్రభుత్వం ఏ సెక్టార్ అయినా వేలంలోనే కోల్ మైన్ తీసుకోవాలని 2020లోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో చాలా కంపెనీలు కోల్ ఉత్పత్తి చేయకపోవడం వల్ల.. విదేశాల నుంచి కోల్ దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. యూపీఏ ప్రభుత్వం కోల్ మైన్‌లో భారీ అవినీతి జరిగింది. అలాంటి అవకాశం ఇవ్వొద్దనే కోల్ వేలం. 8 ఏళ్లలో ఒక్క అవినీతి మరక కూడా మాకు లేదు. ఇదే యూపీఏ హాయాంలో కోకొల్లలా కుంభకోణాలు. 2015 కోల్ చట్టాన్ని ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం పొగిడింది. యూపీఏ హాయాంలో గుజరాత్‌కు ,రాజస్థాన్‌కు కేటాయించిన బొగ్గు గనులనే ఇప్పుడు కేటాయించాం.'' - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి

Kishan reddy on Singareni Coal Mines Auction: గుజరాత్‌తో పాటు తెలంగాణకు కూడా 5 బొగ్గు గనులు కేటాయించామని తెలిపారు. 2020 తర్వాత ప్రభుత్వం ఏ ఒక్క కోల్ బ్లాక్‌ను తన ఇష్టారాజ్యంగా ఇవ్వలేదన్నారు. ఎవరైనా టెండర్ ద్వారానే దక్కించుకోవాలని చెప్పారు. రెండు కోల్ బ్లాకులను సింగరేణి కేంద్రానికి తిరిగి ఇచ్చిందని పేర్కొన్నారు. నైనీ బ్లాకులో ఎటువంటి తవ్వకాలు సింగరేణి చేపట్టలేదని స్పష్టం చేశారు. బొగ్గును ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు.

దేశంలో చాలా బొగ్గు కొరత ఉందన్న కిషన్‌రెడ్డి... ఈ సమస్యను అధిగమించాలంటే ఉత్పత్తి కంపెనీల మధ్య పోటీతత్వం అవసరమని పేర్కొన్నారు. సింగరేణిని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీగా మార్చిందని ఆరోపించారు. సింగరేణి కార్మికులకు మొండి చేయి చూపించారని విమర్శించారు. తాడిచర్ల బొగ్గు గనిని కాకతీయ థర్మల్ ప్లాంట్‌కు కేంద్రం కేటాయిస్తే ఏఎంఆర్‌ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 10, 2022, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details