దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థిని పోటీకి దింపాలని పార్టీ నిర్ణయించిందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. పార్టీ చెప్పిన తర్వాత అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో భాజపా బలపడాలని.. తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని కిషన్రెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార రూపకల్పన చేయాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు.