తెలంగాణ

telangana

ETV Bharat / state

Kishan reddy: డిసెంబర్‌ నుంచి 'దేఖో అప్‌నా దేశ్' - హైదరాబాద్ జిల్లా వార్తలు

దేశంలో 75 వారాలపాటు నిర్వహించనున్న స్వాతంత్య్ర ఉత్సవాలను విజయవంతం చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan reddy) అన్నారు. దేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి డిసెంబర్ నుంచి 'దేఖో అప్‌నా దేశ్' కార్యక్రమం రూపొందించామని.. జనవరి నుంచి ఈ రంగాన్ని పరుగులు పెట్టిస్తామని తెలిపారు. ఈ ఏడాది మొండికి పోకుండా... ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలని కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

kishan reddy, union minister kishan reddy press meet
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు

By

Published : Aug 24, 2021, 2:09 PM IST

Updated : Aug 24, 2021, 4:34 PM IST

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఉన్నప్పుడు ఆర్టికల్ 370(article 370) రద్దు కార్యదూపం దాల్చడం జీవితంలో సంతోషకరమైన విషయమని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి(Kishan reddy) అన్నారు. ప్రధాని మోదీ(pm modi) అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించానని చెప్పుకొచ్చారు. ఈ ఆగస్టు 15నుంచి 75వారాలపాటు జరగనున్న స్వాతంత్య్ర ఉత్సవాలను కూడా విజయవంతం చేస్తామని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నాంపల్లిలోని భాజపా(BJP) ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

కీలక బాధ్యతలు

కరోనా(corona) సమయంలో హోంశాఖ నేతృత్వంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. కంట్రోల్ రూం పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారని... నిరంతరం రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపామని వెల్లడించారు. ఒకేసారి మూడు శాఖలు అప్పగించి... తనపై ప్రధాని మోదీ కీలక బాధ్యతలు పెట్టారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 10శాతం బడ్జెట్ ఈశాన్య రాష్ట్రాలకు కేటాయిస్తుందని అన్నారు. ఆ నిధులతో ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో 3,700 ప్రాచీన కట్టడాలు ఉన్నాయని... వాటిలో 40 కట్టడాలకు యునెస్కో గుర్తింపు వచ్చిందన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.

75వారాల పాటు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాం. ఆజాదీకా అమృత్ వర్ష్ పేరుతో పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. రెండేళ్ల పాటు ఇవి జరుగుతాయి. 2047లో వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవం వస్తుంది. అప్పటి దేశాభివృద్ధిపై సగర్వంగా చెప్పుకోవాలి అనేది ప్రధాని ఆకాంక్ష. దేశాభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ప్రతి వ్యాపార సంస్థ ఆజాదీకా అమృత్ మహోత్సవం లోగో పెట్టుకోవాలి. ఈ వేడుకల కోసం గ్రామాల మ్యాపింగ్ తయారు చేయాలని నిర్ణయించాం. అందుకు సంబంధించి గ్రామపంచాయతీలకు లేఖ రాస్తాం.

-కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి

సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి

రాష్ట్ర ప్రభుత్వం మొండికి పోకుండా... ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గోల్కొండ అభివృద్దికి జీఎంఆర్‌ సంస్థ ముందుకు వచ్చిందని పేర్కొన్న కేంద్రమంత్రి... 75పురాతన కట్టడాలు, చారిత్రక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని అనేక కోటలు నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు.

ఈశాన్య రాష్ట్రాల్లో అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి. రవాణా సదుపాయాలు లేక ఎవరూ అక్కడికి వెళ్లడంలేదు. ప్రస్తుతం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రోడ్డు, రైలు మార్గాలు ఏర్పాటు చేస్తున్నాం. డిసెంబర్‌ నుంచి దేఖో అప్‌నా దేశ్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. కొత్త సంవత్సరం జనవరి నుంచి టూరిజాన్ని పరుగులు పెట్టిస్తాం. కేంద్ర పర్యాటక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం..తెలుగు రాష్ట్రాల నుంచి రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం గర్వంగా ఉంది. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపును వ్యతిరేకించిన దేశాలు కూడా అనుకూలంగా ఓటువేసేలా ప్రధాని మోదీ మాట్లాడారు.

-కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి

ఇదీ చదవండి:Ramya Murder Case: రమ్య ఇంటికి జాతీయ ఎస్సీ కమిషన్ బృందం

Last Updated : Aug 24, 2021, 4:34 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details