తెలంగాణ

telangana

ETV Bharat / state

విజయవాడ మెట్రో.. ప్రతిపాదనలే రాలేదన్న కేంద్రం - ఏపీ తాజా వార్తలు

ఏపీలోని విజయవాడ మెట్రోపై కేంద్రం స్పందించింది. మెట్రో ఏర్పాటుపై కేంద్రానికి.. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు రాలేదని తెలిపింది. కొత్త మెట్రో విధానంపై ప్రతిపాదనలు కోరినా రాష్ట్ర ప్రభుత్వం పంపలేదని పేర్కొంది.

Vijayawada Metro
Vijayawada Metro

By

Published : Dec 12, 2022, 8:17 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మెట్రోకు రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు రాలేదని కేంద్రం తెలిపింది. మెట్రో ఏర్పాటుకు నిధుల సేకరణ, మొబిలిటీ ప్రణాళికను రాష్ట్రాలే తయారుచేయాలని పేర్కొంది. టీడీపీ ఎంపీ కనకమేడల విజయవాడ మెట్రోపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు.. కేంద్రమంత్రి కౌశల్‌ కిషోర్‌ జవాబిచ్చారు. ప్రత్యామ్నాయ నివేదిక, డీపీఆర్‌ను రాష్ట్రాలే తయారుచేయాలని వివరించింది. కొత్త మెట్రో విధానం మేరకు ప్రతిపాదనలు కోరినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పంపలేదని వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details