అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న వనరులన్నింటినీ రాష్ట్రాలవారీగా కేటాయించామని.... అందువల్ల ఇప్పుడు కొత్తగా తెలంగాణకు నిధులు కేటాయించడం సాధ్యంకాదని హర్దీప్సింగ్ పూరీ తెలిపారు. హైదరాబాద్‌లో బలమైన మురుగునీటి వ్యవస్థ ఏర్పాటుకోసం రూ.750 కోట్లు కేటాయించాలన్న తెలంగాణ ప్రతిపాదనపై కేంద్రం ఏ చర్యలు తీసుకుందని ఎంపీ నామ నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్రమంత్రి రాతపూర్వక సమాధానమిచ్చారు.
'తెలంగాణకు కొత్తగా నిధులు కేటాయించడం సాధ్యంకాదు' - హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థపై లోక్‌సభలో చర్చ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ పథకం కింద తెలంగాణలోని 12 పట్టణాలను ఇప్పటికే చేర్చామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ తెలిపారు. వాటికి అదనంగా ఇప్పుడు నిధులివ్వడం కుదరదని స్పష్టం చేశారు.
!['తెలంగాణకు కొత్తగా నిధులు కేటాయించడం సాధ్యంకాదు' union minister on funds issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11156875-706-11156875-1616679225195.jpg)
హైదరాబాద్ నగరంలో నాలా అభివృద్ధితో పాటు ద్రవ, వ్యర్థాల సేకరణ కోసం మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం కోరుతూ 2020 డిసెంబర్ 28న మూడు లేఖలు రాసిందని తెలిపారు. 2015 జూన్ 25న ప్రారంభించిన అటల్ మిషన్ ఫర్ రెజ్యువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ కింద మురుగునీరు, వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యమిస్తున్నామని... అందులో గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని 12 పట్టణాలను ఎంపిక చేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర వార్షిక ప్రణాళిక కింద వెయ్యి 666 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. అందులో కేంద్ర ప్రభుత్వ వాటా 882 కోట్లు ఉన్నట్లు వివరించారు. కేటాయింపులు ఇప్పటికే జరిగాయని.. కొత్తగా ఏం ఇవ్వలేమని తెలిపారు.