తెలంగాణ

telangana

ETV Bharat / state

Kishan reddy comments: 'నిజాం, రజాకార్ల దౌర్జన్యాలను నేటితరానికి తెలియజేయాలి'

Kishan reddy, ajadi ka amtrit mahotsav
కిషన్ రెడ్డి వ్యాఖ్యలు, అమృత్ మహోత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు

By

Published : Nov 20, 2021, 1:25 PM IST

Updated : Nov 20, 2021, 1:51 PM IST

12:20 November 20

అమృత్ మహోత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు: కిషన్‌రెడ్డి

స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను నేటి తరానికి తెలియజేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan reddy comments) తెలిపారు.  సుభాష్ చంద్రబోస్ చరిత్రను ప్రజలకు అందించామని వెల్లడించారు. హైదరాబాద్‌లో గిరిజన మ్యూజియానికి రూ.15 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. నిజాం, రజాకార్ల దౌర్జన్యాలను నేటితరానికి తెలియజేయాలని అన్నారు. గిరిజన బిడ్డల చరిత్ర నేటి తరానికి తెలిసేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. 

స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను తెలియజేస్తున్నామన్న కేంద్రమంత్రి(Kishan reddy comments)... అమృత్ మహోత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. పనికిరాని సిద్ధాంతాలు పట్టుకుని కొంతమంది పనిచేస్తున్నారని ఆరోపించారు. నగరంలోని నారాయణగూడ కేశవ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్సస్‌లో గోల్కొండ సాహితీ మహోత్సవ కార్యక్రమంలో నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయతో పాటు హాజరైన కిషన్ రెడ్డి(Kishan reddy comments) ఈ సందర్భంగా మాట్లాడారు.

మాట వింటారనుకుంటే మంట పెట్టారు..

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరిట 75 వసంతాల స్వాతంత్య్ర సంబురాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారతావని తెల్లదొరల పాలనలో మగ్గుతుండగా.. చాలామంది సంపన్నుల పిల్లలు (azadi ka amrit mahotsav) కేంబ్రిడ్జ్‌లో చదవటానికి లండన్‌ వెళ్లేవారు. బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా దీన్ని ప్రోత్సహించింది. జవహర్‌లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌, అరబిందో ఘోష్‌, డాక్టర్‌ సైఫుద్దీన్‌, మోహన్‌ కుమారమంగళం, ఫజల్‌-ఇ-హుస్సేన్‌... అలా చదివిన ప్రముఖుల్లో కొందరు. అక్కడి బోధనతో ప్రభావితమై ఈ 'భారత జెంటిల్మెన్‌'లు తమ వలస పాలనను సమర్థించే వ్యక్తులుగా బ్రిటన్‌ తయారవుతారని భావించింది. కానీ అక్కడి స్వేచ్ఛాపూరిత వాతావరణం.. వారి ఆలోచనలను మరోవైపు నడిపించింది. ముఖ్యంగా 1891లో ఏర్పడ్డ 'కేంబ్రిడ్జ్‌ మజ్లిస్‌' భారతీయ విద్యార్థులకు మార్గనిర్దేశం చేసింది. మజ్లిస్‌ అంటే పర్షియన్‌లో అసెంబ్లీ (చర్చావేదిక) అని అర్థం. కేంబ్రిడ్జ్‌లోని భారత ఉపఖండ విద్యార్థులంతా ఇందులో సభ్యులుగా ఉండేవారు. భారత్‌లో పరిస్థితులపై ఈ వేదికగా చర్చలు, వాదనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. తొలుత డాక్టర్‌ ఉపేంద్రకృష్ణ దత్‌ ఇంట్లో జరిగే ఈ సమావేశాలు విద్యార్థులను చైతన్యవంతం చేసేవి. ప్రఖ్యాత ఆర్థికవేత్త కీన్స్‌, గాంధీజీ, గోపాలకృష్ణ గోఖలే, లాలా లజపతిరాయ్‌, జిన్నాలాంటి వారు కూడా ఈ మజ్లిస్‌కు వచ్చి తమ అభిప్రాయాలు పంచుకున్నవారే.


విప్లవవాదం వైపు మొగ్గు

1905లో బెంగాల్‌ విభజనతో.. మజ్లిస్‌ కార్యక్రమాల్లో (independence movement) మార్పు ఆరంభమైంది. కేవలం చర్చలకు, అభిప్రాయాలకు వేదికగా కాకుండా.. ఉద్యమ కేంద్రంగా మజ్లిస్‌ మారింది. అంతర్జాతీయ ఉద్యమాల ప్రభావంతో కొంతమంది.. విప్లవపథంలోనే భారత్‌కు స్వాతంత్య్రం సాధ్యమని నమ్మి ఆ దిశగా వెళితే, మరికొందరు భారత్‌కు వచ్చి జాతీయోద్యమంలో భాగమయ్యారు. దాదాపు 100 మందికి పైగా విద్యార్థుల్లో అనేకులు విప్లవవాదం వైపు మొగ్గు చూపారు. దీనిపై బ్రిటిష్‌ ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. 1909లో అప్పటి భారత వ్యవహారాల మంత్రి లార్డ్‌ మోర్లే డౌనింగ్‌ కాలేజీ మాస్టర్‌కు ఈ విషయమై లేఖ రాశారు కూడా! పెరుగుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య, వారి కార్యకలాపాలు ఆందోళన కల్గించేలా ఉన్నాయన్నది అందులో సారాంశం. లేఖ రాయటానికి ముందు.. లార్డ్స్‌ సభలో మాట్లాడుతూ.. "మన విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఈ విద్యార్థులు మున్ముందు భారత్‌ నుంచి మనల్ని వెళ్లగొట్టడం ఖాయం" అని హెచ్చరించారు.

గాంధీబాటలో..

పలువురు ఆంగ్లేయ విద్యార్థులు కూడా ఈ మజ్లిస్‌ (majlis party) చర్చల్లో పాల్గొనేవారు. చిట్టగాంగ్‌కు చెందిన భూస్వామి కుమారుడు జతీంద్రమోహన్‌సేన్‌ గుప్తా మజ్లిస్‌కు అధ్యక్షత వహించారు. భారత్‌కు వచ్చాక మంచి లాయర్‌గా స్థిరపడే అవకాశం ఉన్నా వద్దనుకొని ఉద్యమంలోకి దూకారు. కేంబ్రిడ్జిలో భారతీయుల చర్చలతో ప్రభావితమైన ఆంగ్ల విద్యార్థిని ఎడిత్‌ ఎలెన్‌ (తర్వాత నెలీసేన్‌గుప్తాగా పేరుమార్చుకుంది) జతీంద్రను పెళ్లాడి భారత్‌కు వచ్చి గాంధీబాటలో పయనించారు. అలా బ్రిటన్‌లో అనేకమంది భారత స్వాతంత్య్రోద్యమకారుల కార్ఖానాగా మారింది కేంబ్రిడ్జ్‌ మజ్లిస్‌. స్వాతంత్య్రం వచ్చాక కూడా భారత్‌, పాకిస్థాన్‌ విద్యార్థులతో ఈ మజ్లిస్‌ కొనసాగింది. 1947, 1965 యుద్ధసమయాల్లోనూ సఖ్యత కొనసాగింది. కానీ 1971 బంగ్లాదేశ్‌ ఆవిర్భావ యుద్ధంతో విభేదాలు తలెత్తి.. మజ్లిస్‌ మరుగున పడింది. మళ్లీ ఈ మధ్యే 2019లో దీన్ని పునరుద్ధరించారు.

ఇదీ చదవండి:Azadi Ka Amrit Mahotsav: ఎనిమిదో ఏటే జెండా పట్టి.. రహస్య రేడియో పెట్టి..

Last Updated : Nov 20, 2021, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details