కాళేశ్వరం మూడో టీఎమ్సీ పనులు సహా ఏడు ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి సూచించింది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ విషయంలోనూ ఇదే వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లేఖ రాశారు. ఈ నెల 11న దిల్లీలో కేంద్రమంత్రిని కేసీఆర్ కలిసిన రోజే లేఖ రావడం గమనార్హం. కృష్ణా, గోదావరి బేసిన్లలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఎన్నోసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అక్టోబరు 2న కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాయగా... కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.
ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పందించలే
అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో తీసుకున్న నిర్ణయాలపై ఇరు ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పందించలేదని షెకావత్ పేర్కొన్నారు. అక్టోబర్ 2న కేసీఆర్ రాసిన లేఖలో ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈనెల 11న ప్రత్యుత్తరం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులు, సీతారామ ఎత్తిపోతల పథకం, జీఎల్ఐఎస్ మూడో దశ, తుపాకుల గూడెం, రామప్ప పథకాలన్నీ కొత్తవేనని తెలిపింది.
షెకావత్ తన లేఖలో స్పష్టం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కూడా కొత్తదేనని షెకావత్ తన లేఖలో స్పష్టం చేశారు. కొత్తవాటి డీపీఆర్‌లు కేంద్రానికి సమర్పించి... అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే.. నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు విషయాన్ని ఈ సందర్భంగా షెకావత్ ప్రస్తావించారు.