తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఎన్నికల ప్రచారం - జీహెచ్​ఎంసీ ఎన్నికలు 2020

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో కేంద్రమంత్రులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. భాజపా అభ్యర్థుల తరపున ముమ్మరంగా నగరంలో పర్యటిస్తున్నారు. కాప్రా సర్కిల్ చర్లపల్లి 3వ డివిజన్ అభ్యర్థి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యనందరాయ్​ రోడ్​ షో నిర్వహించారు.

Union Home Assistant Minister election campaign in Greater in kapra circle charlapally divisio
గ్రేటర్​లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఎన్నికల ప్రచారం

By

Published : Nov 28, 2020, 3:37 PM IST

బల్దియా ఎన్నికల ప్రచారంలో భాజపా జోరు పెంచింది. కేంద్రమంత్రులు నగరంలో పర్యటిస్తూ విస్తృతంగా ర్యాలీలు చేపడుతున్నారు. కాప్రా సర్కిల్​ చర్లపల్లి 3వ డివిజన్​ అభ్యర్థి తరపున కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యనందరాయ్ రోడ్​ షో చేపట్టారు.

కుషాయిగూడ నుంచి చర్లపల్లి వరకు నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. తమ అభ్యర్థి కాసుల సురేందర్​రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కేంద్రమంత్రి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలతో ఘనవిజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:ప్రగతిశీల, నిర్ణయాత్మక నాయకత్వాన్ని ఎన్నుకోవాలి : కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details