రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎంఎంటీఎస్ విస్తరణ పనులకు నిధులు విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయని కారణంగానే పనులు నిలిచిపోయినట్లుగా తెలిపిన ఆయన.. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.
యాదాద్రి వరకు..
ఎంఎంటీఎస్ విస్తరణ పనుల కోసం కేంద్రం ఇప్పటి వరకు 789కోట్లు ఖర్చు చేసిందని .. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 414 కోట్లు విడుదల కాని కారణంగానే విస్తరణపనులు నిలిచిపోయాయని వివరించారు.