Andhra Pradesh Debts : ఆంధ్రప్రదేశ్ ఏటా సుమారు 45 వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తోందని కేెంద్రం వివరించింది. ఈ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ రాజ్యసభకు వెల్లడించింది. బడ్జెట్ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఏపీ అప్పు 4 లక్షల 42 వేల 442 కోట్ల రూపాయలని కేంద్రం వివరించింది. 2019వ సంవత్సరంలో 2 లక్షల 64 వేల 451 కోట్ల రూపాయల అప్పు ఉండగా.. అది 2020లో 3 లక్షల 7వేల 671 కోట్ల రూపాయలకు చేరుకుందని ప్రకటించింది.
2021లో 3 లక్షల 53 వేల 21 కోట్ల నుంచి 2022 సవరించిన అంచనాల తర్వాత 3 లక్షల 93 వేల 718 కోట్ల రూపాయలకు చేరుకుందని కేంద్రం వెల్లడించింది.2023 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.4 లక్షల 42వేల 442 కోట్ల రూపాయలని కేంద్రం పేర్కొంది. అయితే రాజ్య సభలో టీడీపీ ఎంపీ కనకమేడల ఆంధ్రప్రదేశ్ అప్పుల వివరాలు తెలపాలని కేంద్రాన్ని కోరారు.