తెలంగాణ

telangana

ETV Bharat / state

'దేశానికి మరింత పేరు తెచ్చేలా పరిశోధనలు చేయాలి'

ఐఐటీ హైదరాబాద్​ను నెలకొల్పిన అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతోందని... కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్​ పోక్రియాల్ నిశాంక్ అన్నారు. ఐఐటీ హైదరాబాద్ అంకుర సంస్థ తయారు చేసిన హైజిన్ ఉత్పత్తులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఆవిష్కరించారు.

Union Education Minister Ramesh Pokriyal Nishank says about IIT hyderabad
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైజిన్ ఉత్పత్తులను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి

By

Published : Apr 17, 2021, 4:28 AM IST

దేశానికి మరింత పేరు తెచ్చేలా ఐఐటీ హైదరాబాద్ ఆచార్యులు, విద్యార్థులు తమ పరిశోధనలు కొనసాగించాలని... కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్​ పోక్రియాల్​ తెలిపారు. ఐఐటీ హైదరాబాద్ అంకుర సంస్థ తయారు చేసిన హైజిన్ ఉత్పత్తులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఆవిష్కరించారు.

ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా దీర్ఘకాలం ప్రభావం చూపే పరిశుభ్రత ఉత్పత్తులు తయారు చేసిన పరిశోధకులను కేంద్ర మంత్రి అభినందించారు. నెలకొల్పిన అతి తక్కువ కాలంలోనే ఐఐటీ హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతోందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: తల్లిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు

ABOUT THE AUTHOR

...view details