రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన 6 ఎయిర్ స్ట్రిప్‌ల సత్వర మంజూరు కోసం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్‌సింగ్ ఖరోలా ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
సీఎం కేసీఆర్‌ను కలిసిన కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి - CM KCR latest news
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్‌సింగ్ ఖరోలా ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన 6 ఎయిర్ స్ట్రిప్‌ల సత్వర మంజూరు కోసం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రదీప్ సింగ్‌ను కోరారు.
వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో కొత్తగా ఎయిర్‌స్ట్రిప్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 6 ఎయిర్‌స్ట్రిప్‌ల కోసం కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో వాటి సత్వర మంజూరు కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎయిర్‌స్ట్రిప్‌ల మంజూరు కోసం కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా సీఎం కేసీఆర్‌కు హామీ ఇచ్చారు.