తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్‌పై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలి: రాజీవ్‌ గౌబా - కరోనా వైరస్​పై రాజీవ్‌ గౌబా దృశ్యమాధ్యమ సమీక్ష

కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్‌ గౌబా రాష్ట్రాల సీఎస్‌లతో దృశ్యమాధ్యమ సమీక్ష జరిపారు. కరోనాపై ప్రజలకు అవగాహన కోసం విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.

Union Cabinet Secretary Rajiv Gauba said covid should be widely publicized
కొవిడ్‌పై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలి: రాజీవ్‌ గౌబా

By

Published : Oct 1, 2020, 5:52 PM IST

సీఎస్‌లతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్‌ గౌబా దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌పై ప్రజలకు అవగాహన కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. కరోనా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని రాజీవ్‌ గౌబా తెలిపారు.

ప్రజలు గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. కొవిడ్ పరీక్షలను ఎక్కువమంది చేయించుకునేలా చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. మాస్కులు, భౌతికదూరంపై విస్తృత ప్రచారం చేయాలని ఆయన వివరించారు.

ఇదీ చూడండి :రాష్ట్రానికి ఐజీఎస్టీ ద్వారా 2,638 కోట్లు రావాలి: హరీశ్​రావు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details