కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్‌లో దారుణం జరిగింది. దుండగులు ఓ వ్యక్తిని రోడ్డు పక్కన పెట్రోలు పోసి నిప్పంటించారు. తెల్లవారుజామున సిరిసేడు పాపయ్యపల్లె గ్రామాల మధ్య... రోడ్డు పక్కన మృతదేహం మంటల్లో కాలుతూ స్థానికులకు కనిపించింది. దగ్గరికి వెళ్లి చూసిన పలువురు, కాలుతున్న వ్యక్తి విలాసాగర్‌కు చెందిన సంతోష్‌గా గుర్తించారు. మృతుడు ఇసుక వ్యాపారం చేస్తారని స్థానికులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Crime: ఇసుక వ్యాపారిని పెట్రోల్ పోసి కాల్చేశారు! - Unidentified thugs killed a man by pouring petrol on him
గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పెట్రోల్ పోసి వ్యక్తిని హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు