హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లేలగూడ వెంకటేశ్వర నగర్ కాలనీలో సందీప్ (30) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. రాత్రి రెండు గంటల సమయంలో మీర్పేట్ పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న సందీప్‌ను గుర్తించారు. పోస్టు మార్టం నిమిత్తం మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. విగతజీవిగా పడివున్న తమ కుమారుడిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీమ్‌తో దర్యాప్తు చేపట్టారు.
మీర్‌పేటలో యువకుని దారుణహత్య - మృతదేహం
మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లేలగూడ వెంకటేశ్వర నగర్‌కాలనీలో స్థానిక యువకుని హత్య జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం