తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుద్యోగుల కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం.. విద్యార్థినులను ఈడ్చుకెళ్లిన పోలీసులు

Unemployees protest: ఆంధ్రప్రదేశ్​లో కలెక్టరేట్ల ఎదుట విద్యార్థి ఉద్యమం దద్దరిల్లింది. ఖాళీగా ఉన్న 2 లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ విద్యార్థి సంఘాలు చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎక్కడికక్కడ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన తెలుపుతున్న విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

Unemployees protest
నిరుద్యోగుల కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం

By

Published : Feb 10, 2022, 12:53 PM IST

నిరుద్యోగుల కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం

Unemployees protest: ఆంధ్రప్రదేశ్​లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోరుతూ విద్యార్థి సంఘాలు చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. విజయనగరంలో ఉద్యోగ సాధన సమితి ఆధ్వర్యంలో మూడు లాంతర్ల కూడలి నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రతిఘటించిన విద్యార్థి సంఘం నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. ర్యాలీలో పాల్గొన్న యువతులనూ పోలీసులు ఈడ్చుకెళ్లారు.

ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తా..

శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే అరెస్టులు చేయడమేంటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నిరుద్యోగులు సమాధానం చెబుతారని హెచ్చరించారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు ఉద్యమాలు ఆపేది లేదని స్పష్టం చేశారు.

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్

విశాఖలో నిరుద్యోగుల కలెక్టరేట్ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. కేజీహెచ్‌ ఓపీ గేట్‌ నుంచి ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌ను అరెస్ట్ చేశారు. బండారు అప్పలనాయుడును సైతం అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు

కడపలో పోలీసుల ఆంక్షలు..

కడప జిల్లా కలెక్టరేట్ ఎదుట.. గురువారం నిరుద్యోగ యువత ఆందోళన చేపట్టనున్న నేపథ్యంలో.. పోలీసులు ముందస్తు ఆంక్షలు విధించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలకు నోటీసులు జారీ చేశారు. విద్యార్థులను ధర్నాకు పంపొద్దని కళాశాల యాజమాన్యాలకు సూచించారు.

తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరెస్టు..

కర్నూలు జిల్లాలో.. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేశ్‌నాయుడును ఆదోని పోలీసులు అరెస్టు చేశారు. చలో కలెక్టరేట్ పిలుపు నేపథ్యంలో.. ముందుస్తుగా అరెస్టు చేశారు.

గుంటూరులో దద్దరిల్లిన విద్యార్థి ఉద్యమం

గుంటూరులో విద్యార్థి, నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో నిరసన కొనసాగాయి. గుంటూరు లాడ్జి సెంటర్‌ అంబేడ్కర్ విగ్రహం వద్ద మోకాళ్లపై కూర్చుని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. జాబ్‌లెస్‌ కాదు... జాబులతో కూడిన క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ విడుదల చేయాలని కోరారు. వెంటనే గ్రూప్ 1, 2 పోస్టులు పెంచాలని డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ను ముట్టడించిన నిరుద్యోగ, యువజన సంఘాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు, నిరుద్యోగులకు మధ్య తోపులాట జరిగింది.

ఇదీ చదవండి:Tollywood Celebrities Meet AP CM Jagan: సీఎం జగన్​తో చర్చలో పాల్గొన్న సినిమా హీరోలు, దర్శకులు వీళ్లే...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details