రాష్ట్రంలో విద్యుత్ రంగానికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెరిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 10 వేల కోట్లను రాయితీల కింద ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2019-20లో రూ. 8 వేల కోట్లను కేటాయించారు. డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడా విద్యుత్ కోతలు విధించకుండా సరఫరా చేయడానికి డిస్కంలు పెద్ద ఎత్తున విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుతం రోజువారి విద్యుత్ డిమాండ్ 13,168 మెగావాట్లకు చేరింది.
సగటు యూనిట్ వ్యయం రూ. 7
రాష్ట్రంలో 24.12 లక్షల వ్యవసాయ బోర్లకు ఉచితంగా కరెంట్ సరఫరా చేసేందుకు ఎక్కువ నిధులు ఖర్చవుతున్నాయి. ఈఏడాది ఎత్తిపోతల పథకాలకు గరిష్టంగా రోజూ వారి 2,200ల మెగావాట్ల డిమాండ్ ఉంది. ఈ పథకాలకు నీటిపారుదల శాఖ నుంచి కూడా డిస్కంలకు నిధులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో కరెంట్ సరఫరాకు యూనిట్‌కు సగటు వ్యయం రూ.7 అవుతోంది. పేదలకు 100 యూనిట్లలోపు వాడే వారికి యూనిట్‌ను రూ. 1.45 లకే డిస్కంలు అందజేస్తున్నాయి.