కోవిదా సౌహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో పెంపుడు జంతువుల పెంపకంపై యాజమానులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దేశ, విదేశాలకు చెందిన పెంపుడు జంతువులకు పోటీలు నిర్వహించారు.
జంతువుల పెంపకంపై అవగాహన - owners were made aware of the pets in the city
జంతువుల పెంపకం, వాటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ నగరంలో నిర్వహించిన డాగ్స్ షో ఆద్యంతం ఆకట్టుకుంది. దేశవిదేశాలకు చెందిన పలు శునకాలు... నడక, అందం, హుందాతనం, వయ్యారం ఇలా పోటీపడి అందరిని మంత్రముగ్ధులను చేశాయి.
జంతువుల పెంపకంపై అవగాహన
ఈ పోటీలో శునకరాజులు నడక, అందంతో అలరించాయి. ప్రస్తుతం పెంపుడు జంతువులు మనలో ఒక భాగంగా మారిపోయిందని.. వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కోవిదా సౌహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు అనూహ్యరెడ్డి అన్నారు. కొవిడ్ సమయంలో ప్రతి ఒక్కరు మానవ సేవ, మాదవసేవ చేశారని... అదే విధంగా పెంపుడు జంతువులను, పక్షులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ షోను నిర్వహించినట్లు చెప్పారు.