జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కాప్రా సర్కిల్ ఈసీఐఎల్ శ్రీచైతన్య పాఠశాలలో సైన్స్ ఎక్స్పో 2020ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ స్కూల్స్ అకాడమిక్ డైరెక్టర్ సీమా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించే విధంగా గ్లోబల్ సిటిజన్‌గా చూడాలన్నదే తమ స్కూల్స్ ముఖ్య ఉద్దేశమని అకాడమిక్ ఆమె తెలిపారు. అందులో భాగంగా విద్యార్థుల్ని స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఆక్టివేట్ చేస్తూ ప్రతిభావంతులుగా మార్చుతున్నట్లు సీమా పేర్కొన్నారు.
శ్రీ చైతన్యలో జాతీయ సైన్స్ దినోత్సవం - hyderabad latest news
ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈసీఐఎల్ శ్రీచైతన్య పాఠశాలలో సైన్స్ ఎక్స్పో 2020ను ఉత్సహంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు హాజరై తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు.
'విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలి'
అందుకే తమ విద్యార్థులు పలు అంశాల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టాపర్స్‌గా నిలుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సైన్స్ ఎక్స్పోల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయవచ్చన్నారు. కొత్త కొత్త ఆవిష్కరణలు కనిపెట్టేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి :ఏకాంత చిత్రాలు.. వీడియోలతో మాజీ భర్త వేధింపులు