తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీకా బాద్​షా: పురపోరులో ఇప్పటికే 80 ఏకగ్రీవాలు...

పురపాలక పోరులో ఫలితాలకు ముందు ఏకగ్రీవాలతో తెరాస జోరుమిదుంది. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలోని 80 వార్డుల్లో 77 స్థానాలను గులాబీ పార్టీ సొంతం చేసుకోగా... మూడింటిని ఎంఐఎం దక్కించుకుంది. మిగిలిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది.

UNANIMOUS WARDS IN TELANGANA MUNICIPALITY ELECTIONS
UNANIMOUS WARDS IN TELANGANA MUNICIPALITY ELECTIONS

By

Published : Jan 25, 2020, 8:15 AM IST

Updated : Jan 25, 2020, 9:35 AM IST


రాష్ట్రంలో పురపాలికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించగా... 80 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో తెరాస 77 సొంతం చేసుకోగా... ఎంఐఎం మూడు స్థానాలు దక్కించుకుంది.

పురపాలక సంఘాల్లోని 2,727 వార్డుల్లో 80 ఏకగ్రీవం కాగా... కార్పొరేషన్లలోని 325 డివిజన్లకుగానూ... ఒకటి ఏకగ్రీవమైంది. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని ఒక డివిజన్​ను తెరాస దక్కించుకుంది. పరకాలలో 22 వార్డులు ఉండగా 11 వార్డుల్లో... అధికార పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెన్నూరులో 7, సత్తుపల్లిలో 6 వార్డులు తెరాస ఖాతాలో చేరాయి. మేడ్చల్‌లో 5, రంగారెడ్డి జిల్లాలో 3, సిరిసిల్లలో 4 చోట్ల గులాబీ పార్టీ అభ్యర్థులు.. ఏకపక్ష విజయం సాధించారు.

కార్పొరేషన్లలోని 324 డివిజన్లు, పురపాలికల్లోని 2,653 వార్డుల భవితవ్యం ఈరోజు తేలనుంది.

ఇవీ చూడండి: 27న పరోక్ష ఎన్నిక.. నేటి సాయంత్రం నుంచి ప్రత్యేక నియమావళి

Last Updated : Jan 25, 2020, 9:35 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details