ఏపీలో పురపోరులో భాగంగా తొలి రోజు నామినేషన్ల ఉపసంహరణ తరువాత పుర, నగరపాలక, నగర పంచాయతీల్లో 222 డివిజన్, వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 221 చోట్ల వైకాపా అభ్యర్థులే ఉన్నారు. రాయలసీమలోని కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అత్యధిక చోట్ల ఉపసంహరణల తరువాత అధికార పార్టీకి చెందిన అభ్యర్థుల సింగిల్ నామినేషన్లు మిగిలాయి. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉన్నందున ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించాల్సి ఉంది.
అత్యధింకంగా కడపలోనే..
మంగళవారం రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం.. నామినేషన్ల ఉపసంహరణల తరువాత ఏకగ్రీవమవుతున్న వాటిలో కడప జిల్లాలో అత్యధికంగా 100 డివిజన్, వార్డు స్థానాలున్నాయి. ఈ జిల్లాలో పులివెందుల పురపాలక సంఘంలోని 33 వార్డుల్లోనూ సింగిల్ నామినేషన్లు మిగిలాయి. రాయచోటిలో 28, కడప నగరపాలక సంస్థలో 17 డివిజన్లు ఏకగ్రీవమవుతున్నాయి.
అన్నీచోట్ల వైకాపావే..