'గొడుగుతో... కరోనాకు దూరం' - umberella to save from corona
గొడుగు మనల్ని ఎండ, వాన నుంచి కాపాడుతుందని మాత్రమే మనకు తెలుసు. ఏపీ విశాఖకు చెందిన ప్రముఖ వైద్యుడు, పద్మశ్రీ గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావు కరోనా సోకకుండా కూడా గొడుగును వినియోగించవచ్చని అంటున్నారు. అసలీ సిద్ధాంతమేమిటి.. ఈ గొడుగు కథ ఏమిటో తెలుసుకుందాం

'గొడుగుతో... కరోనాకు దూరం'
ప్రజలంతా భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలంటే ఒక పరికరం తప్పనిసరి అని ఏపీ విశాఖకు చెందిన ప్రముఖ వైద్యుడు, పద్మశ్రీ గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావు అంటున్నారు. కరోనా సోకకుండా ఉండటానికి గొడుగులు ఉపకరిస్తాయంటూ... దీనిపై ఆయన ఓ గొడుగు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. జాతీయంగా, అంతర్జాతీయంగా ఇప్పటికే దీన్ని సూచించానంటున్నారు. నామమాత్రపు ఖర్చుతోనే కొవిడ్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ఇది ఉత్తమమైన మార్గమంటున్న డాక్టర్ కూటికుప్పల సూర్యారావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.