రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి, కమిషనర్ అశోక్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ ఉమర్ జలీల్‌ను ప్రభుత్వం నియమించింది. జలీల్ 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన గతంలో నల్గొండ, వరంగల్, మెదక్ జిల్లాల జేసీగా, బీసీ సంక్షేమ శాఖ సంచాలకునిగా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శిగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా, వికారాబాద్ కలెక్టర్‌గా పనిచేశారు. ఇటీవల వికారాబాద్ నుంచి బదిలీ అయ్యారు. కొన్ని రోజులుగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నా ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఉమర్ జలీల్ - latest news on intermediate board secretary as jalil appointed
ఇంటర్మీడియట్ బోర్డు నూతన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జలీల్ ఉమర్ నియమితులయ్యారు. ఆయన గతంలో పలు శాఖలలో కీలక బాధ్యతలు చేపట్టి ఇటీవల వికారాబాద్ జిల్లా నుంచి కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
![ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఉమర్ జలీల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4506240-891-4506240-1569036665821.jpg)
ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఉమర్ జలీల్