తెలంగాణ

telangana

ETV Bharat / state

భారత్​ బయోటెక్​ను సందర్శించిన ఉక్రెయిన్​ ఆరోగ్య శాఖ మంత్రి - telangana varthalu

ఉక్రెయిన్​ ఆరోగ్య శాఖ మంత్రి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ భారత్​ బయోటిక్​ కేంద్రాన్ని సందర్శించింది. ఉక్రెయిన్​కు కొవాగ్జిన్‌ సరఫరా గురించి భారత్​ బయోటెక్ యాజమాన్యంతో కమిటీ సభ్యులు చర్చించారు. కొవాగ్జిన్​ను మాస్ వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించనున్నట్లు ఉక్రెయిన్ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారని భారత్​ బయోటెక్​ ప్రకటించింది.

భారత్​ బయోటెక్​ను సందర్శించిన ఉక్రెయిన్​ ఆరోగ్య శాఖ మంత్రి
భారత్​ బయోటెక్​ను సందర్శించిన ఉక్రెయిన్​ ఆరోగ్య శాఖ మంత్రి

By

Published : Feb 24, 2021, 7:20 PM IST

ఉక్రెయిన్ ఆరోగ్య శాఖ మంత్రి మాక్సిమ్​ స్టెపనోవ్​ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ హైదరాబాద్​లో జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ కేంద్రాన్ని సందర్శించింది. ఈ కమిటీలో ఆ దేశ ఆర్థిక మంత్రి, డిప్యూటీ ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు. ఉక్రెయిన్​కు కొవాగ్జిన్‌ సరఫరా గురించి భారత్​ బయోటెక్ యాజమాన్యంతో చర్చించారు. ప్రాధాన్యత క్రమంలో కొవాగ్జిన్​ను ఉక్రెయిన్​కు సరఫరా చేసేందుకు టైమ్ లైన్​తో పాటు ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్​కు సంబంధించిన ఒప్పందంపై చర్చించినట్లు భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు.

భారత్, ఉక్రెయిన్ మధ్య సహయ సహకారాలు, దౌత్య సంబంధాలకు చాలా చరిత్ర ఉందని... టీకా తయారీలో భారత్​కు ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటామని ఉక్రెయిన్ ఆరోగ్య శాఖ మంత్రి మాక్సిమ్ స్టెపనోవ్ వ్యాఖ్యానించారని భారత్​ బయోటెక్ పేర్కొంది. కొవాగ్జిన్​ను మాస్ వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించనున్నట్లు ఆయన తెలిపారని ప్రకటించింది.

ఇదీ చదవండి:కరోనా నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే దిల్లీలోకి ఎంట్రీ

ABOUT THE AUTHOR

...view details