‘‘భారత్‌లో మాస్కుల కొరతపై ప్రశ్నించిన వైద్యుణ్ని మానసిక చికిత్సాలయానికి పంపించారని’’ పేర్కొంటూ యూకేకు చెందిన మెట్రో పత్రిక ‘‘డాక్టర్ ఇన్ ఇండియన్ పీపీఈ రో.. బండిల్డ్ ఆఫ్ టూ మెంటల్ యూనిట్’’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. వైద్యుడు డాక్టర్ సుధాకర్‌తో పోలీసులు వ్యవహరించిన తీరు, అంతకు ముందు చోటుచేసుకున్న పరిణామాలను ఈ కథనంలో ప్రస్తావించింది. జోయల్ టేలర్ అనే రచయిత ఈ కథనాన్ని రాశారు. డాక్టర్ సుధాకర్ చొక్కా లేకుండా ఉన్న చిత్రంతో పాటు ఆయన చేతులను పోలీసులు వెనక్కి పెట్టి తాడుతో కడుతున్నట్లు ఉన్న చిత్రాన్ని ప్రచురించారు.
డాక్టర్ సుధాకర్‌పై చేసిన దాడిపై యూకే పత్రిక ఏమందంటే... - foreign news paper on dr sudhakar news
డాక్టర్ సుధాకర్‌తో పోలీసుల ప్రవర్తించిన తీరును వివరిస్తూ, మాస్కుల కొరతపై ప్రశ్నించిన వైద్యుణ్ని మానసిక చికిత్సాలయానికి పంపించారంటూ... యూకేకు చెందిన మెట్రో పత్రిక ప్రచురించింది.

డాక్టర్ సుధాకర్‌పై చేసిన దాడిపై యూకే పత్రిక ఏమందంటే...