ఉజ్వల ప్రస్థానం, బంగారు బాట పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ జూబ్లీహాల్లో జరిగింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు ఆ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ పుస్తకాలను ముఖ్యమంత్రి పీఆర్వో విజయ్ కుమార్ రచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రత కోసం నిరంతరం శ్రమిస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ వెలుగులు నింపిన ప్రభాకర్ రావుపై కొన్ని రాజకీయ పార్టీలు నిందలు వేయడం సబబు కాదని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. ఆంధ్రాలో పోలవరం దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంటే... తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ను పూర్తిచేశాడని ఆర్.నారాయణమూర్తి ప్రశంసించారు.
ఉజ్వల ప్రస్థానం పుస్తకావిష్కరణ - పుస్తకావిష్కరణ
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అన్నారు.
ఉజ్వల ప్రస్థానం పుస్తకావిష్కరణ