వంటగ్యాస్‌కు ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో గ్యాస్ కంపెనీలు ఆంక్షలు విధించాయి. బుక్ చేసిన సిలిండరు డెలివరీ అయిన 14 రోజుల తర్వాత మాత్రమే మరో దానిని బుక్ చేసుకునేలా గ్యాస్ కంపెనీలు నిర్ణయించాయి. భారత్, హెచ్‌పీ గ్యాస్ కంపెనీలు శుక్రవారం నుంచి ఈ నిబంధనను అమలు చేయగా.. ఇండేన్ కంపెనీ శనివారం నుంచి అమలు చేయనున్నట్లు తెలిసింది.
కేంద్రం ఉచిత గ్యాస్ పథకం.. కంపెనీల ఆంక్షలు - ujjwala Gas Scheme
లాక్‌డౌన్ నేపథ్యంలో ఉజ్వల పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్ పొందిన వారికి మూడు బండలు ఉచితంగా అందజేస్తామని కేంద్రం ప్రకటించింది. గ్యాస్ సిలిండర్లకు డిమాండు పెరగటం వల్ల పలు గ్యాస్ సంస్థలు ఆంక్షలు విధించాయి. బుక్ చేసిన సిలిండరు డెలివరీ అయిన 14 రోజుల తర్వాత మాత్రమే మరో దానిని బుక్ చేసుకునేలా నిబంధన పెట్టాయి.
![కేంద్రం ఉచిత గ్యాస్ పథకం.. కంపెనీల ఆంక్షలు ujjwala Center Free Gas Scheme companies Restrictions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6569233-315-6569233-1585363091682.jpg)
ఇప్పటి వరకు సిలిండరు వచ్చిన 24 గంటల తరవాత మరొకటి నమోదు చేసుకోవచ్చు. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించటం వల్ల ప్రజలు ముందు జాగ్రత్తగా సిలిండర్లు బుక్ చేస్తున్నారు. ఉజ్వల పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్ పొందిన వారికి మూడు బండలు ఉచితంగా అందజేస్తామన్న కేంద్రం ప్రకటతో వారు కూడా సిలిండర్లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. తెలంగాణలో సాధారణ రోజుల్లో సగటున రెండు లక్షల సిలిండర్లు నమోదవుతుంటాయి. ప్రస్తుతం రోజుకు మూడు నుంచి మూడున్నర లక్షల వరకు బుకింగ్స్ వస్తుండటం వల్ల 14 రోజుల నిబంధనను అమలులోకి తీసుకొచ్చారు.
ఇదీ చూడండి :కాలినడకన మధ్యప్రదేశ్‌కు పయనం