ఆషాడంలో జరిగే బోనాల పండగకు సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి దేవాలయం దేదీప్యమైన వెలుగులతో శోభను సంతరించుకుంది. ఆలయం అంతటా విద్యుత్ కాంతులు విరజిల్లుతున్నాయి. మహంకాళి ఆలయం పరిసరప్రాంతాలు రంగురంగుల దీపాలతో చూపరులను కనువిందు చేస్తున్నాయి. ఆలయ ముఖద్వారాన్ని సుందరంగా అలంకరించారు. తెలంగాణ ప్రభుత్వం ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నందున అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాత్రుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
విద్యుత్ కాంతులతో ముస్తాబైన మహంకాళి ఆలయం - ujjaini temple
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం బోనాల ఉత్సవాలకు ముస్తాబైంది. రంగురంగుల దీపాలతో ఆలయప్రాంగణం సర్వాంగసుందరంగా సిద్ధమైంది.
విద్యుత్ కాంతులతో ముస్తాబైన మహంకాళి ఆలయం